News August 25, 2025
రేపు కాల్ లెటర్స్ విడుదల: డీఎస్సీ కన్వీనర్

AP: మెగా <<17508409>>డీఎస్సీ<<>> మెరిట్ అభ్యర్థులకు రేపు కాల్ లెటర్స్ అందుతాయని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులతో పాటు రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగితో కలిపి ముగ్గురు ఒక టీమ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన ఎల్లుండి నుంచి మొదలు కానుంది.
Similar News
News August 25, 2025
OT డ్యూటీలతో ఆరోగ్యంపై ప్రభావం: సర్వే

ఉద్యోగుల్లో ఓవర్ టైమ్(OT) వర్క్ చేయడంపై వ్యతిరేకత ఉందని జీనియస్ HR టెక్ సర్వేలో తేలింది. అదనపు ప్రయోజనాలు లేకుండా వర్కింగ్ అవర్స్‌ను పొడిగించడాన్ని మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించినట్లు పేర్కొంది. ఓవర్ టైమ్ డ్యూటీలతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని 44% మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. తగిన బెనిఫిట్స్ ఉంటే OT చేసేందుకు ఇబ్బందేమీ లేదని 40శాతం చెప్పినట్లు వెల్లడించింది.
News August 25, 2025
భారత్‌పై కావాలనే టారిఫ్స్ పెంచారు: వాన్స్

రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ కావాలనే భారత్‌పై టారిఫ్స్ విధించారని US వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ తెలిపారు. ‘ఆయిల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపి రష్యన్స్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే INDపై సెకండరీ టారిఫ్స్ విధించారు. రష్యా హత్యలను ఆపకపోతే ఏకాకిగానే మిగిలిపోతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే కొత్తగా ఆంక్షలు విధించకుండా రష్యాపై ఎలా ఒత్తిడి తెస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.
News August 25, 2025
వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్

దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు. SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.