News March 1, 2025
అక్కా.. అని పిలిచి అత్యాచారం

పుణే రేప్ కేసు <<15605696>>నిందితుడు<<>> దత్తాత్రేయ గడేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు తె.జామున యువతి స్వార్గేట్ బస్టాండ్‌లో నిల్చొని ఉండగా గడే ఇన్‌షర్ట్ వేసుకొని వచ్చాడు. ‘దీదీ(అక్కా) మీ బస్సు పక్కన నిలిపి ఉంది’ అని తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు ఆన్ చేయలేదేంటని ఆమె ప్రశ్నించగా ప్రయాణికులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. ఆమె అందులోకి ఎక్కగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Similar News
News March 1, 2025
జెలెన్స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.
News March 1, 2025
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News March 1, 2025
మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.