News September 7, 2024
సీతక్కకు ఫోన్ చేసి తిట్లు.. పోలీసుల అదుపులో వ్యక్తి!

TG: మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. తీవ్రంగా పరిగణించిన ఆమె తన డ్రైవర్ శ్రీనుతో పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్‌ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <


