News September 10, 2024
కోహ్లీ రూమ్‌కి పిలిచి ధైర్యం చెప్పారు: యశ్ దయాళ్

IPLలో గత ఏడాది విఫలమైన యశ్ దయాళ్, ఈ ఏడాది RCBలో అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ తనకిచ్చిన ధైర్యమే దానిక్కారణమని యశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు విరాట్ నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ‘నువ్వెలా ఆడినా ఏం ఫర్వాలేదు. ఈ సీజన్ అంతా నువ్వు జట్టులో ఉంటావు. ఎప్పుడు ఆర్సీబీకి ఆడినా నీ ముఖంపై నవ్వు ఉండాలి’ అన్నారు. ఆ మాటలు నాలో ధైర్యం నింపాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
నేటి నుంచి గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకొని 8pmకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
News January 10, 2026
సగం ధరకే వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి అమలయ్యే ఈ స్కీమ్ వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News January 10, 2026
ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల విషయాల్లో కీలక ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ జీవో 58 ప్రకారం అల్టర్నేట్ ఉద్యోగం కావాలా? పరిహారం కావాలా? అనే విషయాన్ని తెలియజేస్తూ 8 వారాల్లో ఆప్షన్స్ ఇవ్వాలంది. అదనపు పరిహారం కోసమైతే 3 నెలల్లో, ప్రత్యామ్నాయ ఉద్యోగమైతే ఖాళీలను బట్టి 6 నెలల్లో పరిష్కరించాలని రవాణా శాఖను ఆదేశించింది.


