News December 5, 2024
ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు

TG: గత నెల 30న ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్‌గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్లు తెలిపింది. ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
Similar News
News November 15, 2025
ఎల్లుండి క్యాబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై చర్చ

TG: రాష్ట్ర మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయంతో జోష్‌లో ఉన్న హస్తం పార్టీ.. త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపైనే చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే.
News November 15, 2025
పిన్‌కోడ్‌ను ఎలా గుర్తిస్తారో తెలుసా?

దేశంలోని ప్రతి ప్రాంతాన్ని గుర్తించేందుకు ఇండియా పోస్ట్ 6 అంకెల పిన్ కోడ్ విధానాన్ని అనుసరిస్తోంది. ‘500001’ కోడ్‌లో మొదటి అంకె దేశంలోని దక్షిణాదిని సూచిస్తుంది. రెండో అంకె 0 ఉంటే తెలంగాణ.. 1,2,3 ఉంటే ఏపీ అని అర్థం. మూడో అంకె జిల్లాను & 4వ అంకె ఆ జిల్లాలో గల నిర్దిష్ట డెలివరీ రూట్‌ను సూచిస్తుంది. 5 & 6వ అంకెలను బట్టి పోస్టాఫీస్‌ను గుర్తిస్తారు. 1972 AUG 15న దేశంలో పిన్‌కోడ్ వ్యవస్థ ప్రారంభమైంది.
News November 15, 2025
17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం

AP: చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్టయ్యిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దేశవిదేశాల నుంచి సమ్మిట్‌లో 5,587 మంది ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తంగా 17 నెలల్లోనే రూ.20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించాం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని తెలిపారు.


