News October 24, 2024

భర్తను అలా పిలవడం క్రూరత్వమే: హైకోర్టు

image

భర్తను భార్య హిజ్రా అని పిలవడం మానసిక హింసకు గురి చేయడమే అని పంజాబ్, హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. కింది కోర్టు ఇచ్చిన విడాకులు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తన భార్య పోర్న్ సైట్లకు బానిసయిందని, తనను శారీరకంగా బలహీనంగా ఉన్నానంటూ అవమానించేదని భర్త వాదించారు. కేసులో భార్య ప్రతివాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వుల్ని సమర్థించింది.

Similar News

News December 4, 2025

హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

image

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.