News October 8, 2025
స్విట్జర్లాండ్ నుంచి వచ్చి.. శివ భక్తురాలిగా మారి..

స్విట్జర్లాండ్‌కు చెందిన సుసి బ్రాస్ రెండేళ్ల క్రితం సినిమాల్లో నటించాలని భారత్‌కు వచ్చింది. అయితే ఆమె ఓసారి వైశాలి సోన్‌పుర్‌లో ఉన్న బాబా హరిహర్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఉద్యోగం పోవడంతో తులసిమాల ధరించి పంచాక్షరిని జపం మొదలుపెట్టింది. మాంసాహారాన్ని త్యజించింది. ఆలయానికి సమీపంలోనే అద్దెకుంటూ దైవసేవలో గడుపుతోంది. ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన సుసి భక్తి ప్రశాంతతను ఇస్తోందని తెలిపింది.
Similar News
News October 8, 2025
మెదడు సమస్య కాళ్లలో మొదలు: డాక్టర్

‘మెదడు మోకాళ్లలో ఉందా?’ అని అందరం అనే ఉంటాం కదా. కానీ డిమెన్షియా మోకాళ్లలో మొదలవుతుందని న్యూరో సర్జన్ డా. అరుణ్ L నాయక్ తెలిపారు. పలు శారీరక, మానసిక సమస్యలు కలిసిన వ్యాధి డిమెన్షియా అని ఆయన వివరించారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కాలి కండరాల్లో పటుత్వం పోయి మెదడుకు పంపాల్సిన కొన్ని కెమికల్స్‌ను నరాలు పంప్ చేయలేవు. ఫలితంగా బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గడం, మతిమరుపు తదితరాలు డిమెన్షియాకు దారితీస్తాయట.
News October 8, 2025
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే <<17939337>>జీవ ఎరువు<<>> ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.
News October 8, 2025
నారద భక్తి సూత్రాలు – 4

‘యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి’ నారద భక్తి సూత్రాల్లో ఇది నాలుగవది. దీనర్థం.. నిష్కల్మషమైన భక్తిని పొందిన మానవుడు సిద్ధుడు అవుతాడు. వారికి మృత్యు భయం ఉండదు. జీవితంలో మరేదీ అవసరం లేదన్నట్లు శాశ్వతమైన తృప్తిని పొందుతాడు. ఈ భక్తి లభించడం వల్ల సాధన పూర్తై, అన్ని కోరికలు తీరిన అనుభూతి కలుగుతుంది. అమరత్వం లభిస్తుంది. సమస్త సుఖాలకు మూలం, ముక్తికి మార్గం ఈ భక్తే. <<-se>>#NBS<<>>