News November 23, 2024
ఫలితాలకు ముందే క్యాంప్ కసరత్తులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ మొదలవక ముందే అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. తాము గెలుస్తామని భావిస్తున్న మహా వికాస్ అఘాడీ గెలిచిన నేతలు చేజారకుండా శిబిరాలకు తరలించే కసరత్తు చేస్తోంది. తమ నేతలను ముంబైలోని క్యాంపుకు పంపుతామని శివసేన నేత సంజయ్ రౌత్ నిన్న ప్రకటించారు. అటు కూటమిలోని మిగతా పార్టీలు తెలంగాణ లేదా కర్ణాటకలో గెలిచిన అభ్యర్థులను దాచిపెట్టే అవకాశముందని సమాచారం.
Similar News
News December 1, 2025
NGKL: అరుణాచలం, కాణిపాకానికి ప్రత్యేక బస్సు

పౌర్ణమి పురస్కరించుకొని డిసెంబర్ 3న రాత్రి 8 గంటలకు అరుణాచలం గిరిప్రదర్శన కు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈనెల 4వ తేదీన ఉదయం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, దర్శనం అనంతరం 5వ తేదీ అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9490411590, 9490411591, 7382827527ను సంప్రదించాలని కోరారు.
News December 1, 2025
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News December 1, 2025
ఐటీ రంగంలో పెరుగుతున్న HIV కేసులు!

దేశంలో IT రంగానికి చెందిన వారిలో HIV కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) హెచ్చరించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని NACO వర్గాలు చెప్పాయి. వ్యవసాయ కూలీల్లోనూ కేసులు ఎక్కువైనట్లు తెలిపాయి. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు టెస్టులు పెంచాలని సూచించాయి. ఎయిడ్స్ కేసుల్లో మహారాష్ట్ర(3,62,392), AP(2,75,528) టాప్‌లో ఉన్నాయి.


