News March 24, 2024

త్వరలోనే పిఠాపురంలో ప్రచారం: పవన్

image

AP: త్వరలోనే పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని జనసేనాని పవన్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ మంత్రి రంగారావు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి పవన్‌కు వర్మ వివరించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

Similar News

News November 18, 2025

ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

image

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.

తాత చావు రోజునా వదల్లేదుగా.. మేనేజర్‌తో ఉద్యోగి చాట్ వైరల్!

image

తాత చనిపోవడంతో లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి మేనేజర్ నుంచి వచ్చిన రిప్లైకు నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘రాత్రి తాత చనిపోయాడు నేను ఇవాళ ఆఫీస్‌కు రాలేకపోతున్నా’ అని ఓ ఉద్యోగి మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘సెలవు తీసుకో. కానీ క్లయింట్‌లతో ఇండక్షన్ కాల్‌లో ఉండాలి. వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండి డిజైనర్లకు హెల్ప్ చేయి’ అని జవాబిచ్చాడు. కంపెనీల్లో ఉన్న టాక్సిక్ కల్చర్‌పై విమర్శలొస్తున్నాయి.