News January 4, 2025
చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?: జగన్
AP: వరుసగా క్యాబినెట్ భేటీలు జరుగుతున్నా ‘తల్లికి వందనం’ ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని YS జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
Similar News
News January 6, 2025
అనంత శ్రీరామ్ కామెంట్స్పై ‘కల్కి’ డైరెక్టర్ స్పందన!
మూవీల్లో మన పురాణాలను <<15072339>>వక్రీకరిస్తున్నారని<<>> సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఇన్స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘అమెజాన్ జపాన్లో ట్రాన్స్లేటెడ్ మహాభారతం పుస్తకాలు భారీగా విక్రయించారు. ఇది చాలా బాగుంది’ అని రాసుకొచ్చారు. అనువదించిన మహాభారతం పుస్తకాలనే ఎక్కువ మంది చదివారని ఆయన పోస్ట్ సారాంశం.
News January 6, 2025
‘డాకు మహారాజ్’లో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్
నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నేషనల్ అవార్డ్ పొందిన డైరెక్టర్ సందీప్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, సినిమాల్లోకి రావాలని తాను చిన్ననాటి నుంచే కలలు కన్నట్లు ట్వీట్ చేశారు. ‘ఒక్క ఫోన్ కాల్తో నెక్స్ట్ డే వచ్చి షూటింగ్లో పాల్గొన్నావ్. థాంక్స్ తమ్ముడు. అదరగొట్టావ్’ అని డైరెక్టర్ బాబీ రిప్లై ఇచ్చారు.
News January 6, 2025
గన్నవరం TDP ఆఫీసు ఘటన.. పిటిషన్లు కొట్టివేత
AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 17 మంది తమను అరెస్ట్ నుంచి కాపాడాలని కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు.