News May 4, 2024

ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించడం లేదా?: జగన్

image

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని జగన్ విమర్శించారు. ‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. నా హయాంలో అభివృద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు. కొత్తగా 4 ఓడరేవులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఇవి చంద్రబాబుకు కనిపించడం లేదా? నాడు-నేడుతో స్కూళ్లను అభివృద్ధి చేశాం. వాలంటీర్లతో పథకాలు చేరవేస్తున్నాం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం’ అని చెప్పారు.

Similar News

News March 17, 2026

మరో కీలక ఇరాన్‌ నేత టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడి

image

యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వ్యవహారాల్లో కీలకంగా మారిన ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి చేశాయి. ఈ అటాక్‌లో లారిజనీ మరణించారా? లేదా? అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రాత్రి జరిపిన దాడుల్లో పారామిలటరీ చీఫ్ గొలమ్‌రెజానూ టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

News March 17, 2026

SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

News March 17, 2026

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

image

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సభ వాడీవేడిగా జరిగింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు స్పష్టం చేశారు.