News April 24, 2024
పిల్లలకు షుగర్ తినిపించవచ్చా?

‘నెస్లే’ పిల్లల ఫుడ్ ప్రొడక్టుల్లో అదనపు షుగర్ ఉంటోందని వస్తున్న వార్తలతో పేరెంట్స్‌లో అయోమయం నెలకొంది. అయితే.. షుగర్‌కు అలవాటుపడిన పిల్లలు అన్నం, కూరగాయలు తినడానికి చాలా కష్టపడుతుంటారని ముంబైలో డయాబెటిస్ సెంటర్‌ను నడిపిస్తున్న డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపారు. వారు హైపర్ అగ్రేసివ్గా మారతారని, వారిలో చికాకు పెరుగుతుందని అన్నారు. అందుకే రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ షుగర్స్ ఇవ్వొద్దన్నారు.
Similar News
News March 12, 2026
అమరావతిలో S+12 అంతస్తులతో 6 టవర్స్

అమరావతిలోని రాయపూడిలో AIS అధికారుల టవర్స్ నిర్మాణాన్ని APCRDA ఆధ్వర్యంలో కొనసాగిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో S+12 అంతస్తులతో 6 టవర్స్‌లో మొత్తం 144 విశాలమైన నివాస యూనిట్లు (సుమారు 3,500 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
News March 12, 2026
చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.
News March 12, 2026
The Hundred: పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనడంపై విమర్శలు!

ఇంగ్లండ్ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.


