News May 22, 2024
యాభై LIC పాలసీలు తీసుకోవచ్చా?

బాలీవుడ్ నటి, BJP ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తనకు 50 LIC పాలసీలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే సామాన్యులు ఇలా 50 లేదా అంతకన్నా ఎక్కువ పాలసీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వాటిని మేనేజ్ చేయడం సవాల్తో కూడుకున్నదని, క్లెయిం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎంత మొత్తానికి కవరేజ్ అవసరమో పరిశీలించి అందుకు తగ్గ ప్లాన్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


