News October 25, 2025

ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

image

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News October 26, 2025

కరూర్ బాధితులను కలవనున్న విజయ్

image

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.

News October 25, 2025

స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

image

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.

News October 25, 2025

108, 104 సేవల్లో రూ.2 వేలకోట్ల స్కామ్: YCP

image

AP: 108, 104 సేవలను ప్రభుత్వం డబ్బు సంపాదనకు వాడుకుంటోందని YCP ఆరోపించింది. అంబులెన్స్ సేవల కాంట్రాక్ట్ ఎలాంటి అనుభవంలేని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ Ltdకు అప్పగించడాన్ని తప్పుబట్టింది. TDP నేత డా.పవన్ కుమార్‌ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారని, ఇందులో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసింది. ఈ కాంట్రాక్ట్‌తో TDP నెలకు రూ.31 కోట్ల మామూళ్లు తీసుకుంటోందని విడదల రజిని ట్వీట్ చేశారు.