News March 23, 2024
లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా?: కిషన్‌రెడ్డి

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదులుతోంది. కేజ్రీవాల్ సీఎం అయితే అవినీతిని విడిచిపెట్టాలా? తెలంగాణ లిక్కర్ మోడల్‌నే ఢిల్లీకి బదిలీ చేశారు. దర్యాప్తు సంస్థలు దోషుల్ని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుంది?’ అని అన్నారు.
Similar News
News October 21, 2025
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అప్పుడేం చేయాలి?

బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం. ఇది 48 నిమిషాల పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం. ఈ వేళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయం జ్ఞానం, శారీరక పెరుగుదలకు అనుకూలం. ఈ వాతావరణంలో ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దైవ శక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ సమయం.
News October 21, 2025
పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా షాహిన్ అఫ్రీది

మెన్స్ టీమ్ వన్డే కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. బౌలర్ షాహీన్ అఫ్రీదిని నూతన సారథిగా నియమించింది. వచ్చే నెల 4న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 25 ఏళ్ల ఈ పేసర్ 66 వన్డేల్లో 131 వికెట్లు తీశారు. 2024లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అఫ్రీదికి ఉంది.
News October 21, 2025
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే?

బ్రహ్మ ముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన లేకుండా పోతుంది. ఈ వేళ లేచేవారి గుండె, మెదడు పనితీరు, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీవకణాలు ఉద్రేకం పొంది, దైవికారోగ్యం లభిస్తుంది.