News January 6, 2025
ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్

AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.
Similar News
News December 28, 2025
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలుపొందింది వీళ్లే..

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా అశోక్ కుమార్, సి.కళ్యాణ్, వై.వి.ఎస్.చౌదరి, ప్రసన్న కుమార్, దిల్ రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనారాయణ, కె.ఎస్.రామారావు, అమ్మిరాజు, చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు.
News December 28, 2025
రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

TG: BRS చీఫ్ KCR రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన సభలో జరిగే చర్చలో పాల్గొననున్నారు. అందులోనూ కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై CM రేవంత్, KCR మధ్య మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. గులాబీ బాస్ సంధించే ప్రశ్నలకు CM తనదైన శైలిలో ఎలా స్పందిస్తారో చూసేందుకు మీరూ సిద్ధమా? రేపు ఉ.10.30 గంటల నుంచి అసెంబ్లీ లైవ్‌ను Way2Newsలో చూడండి.
News December 28, 2025
త్వరలో ఒక్క సిగరెట్ ధర రూ.72

ఎక్సైజ్ డ్యూటీ పెంచి సిగరెట్లను కొనలేనంత భారం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ.18కు కొంటున్న ఒక్క సిగరెట్ ధర త్వరలో రూ.72కు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రేట్లు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్-2025లో కేంద్రం ప్రపోజల్స్ పెట్టింది. దీనిపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


