News May 10, 2024

పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఓటు వేయొచ్చా?

image

ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పలు సందర్భాల్లో వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కేసు విచారణ ప్రారంభం కాకపోవడం వల్ల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, 1951 కింద వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీరు ఓటు వేయొచ్చు. అయితే పోలింగ్ తేదీకి కనీసం 15 రోజుల ముందు రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమచారం ఇవ్వాలి. కస్టడీలో ఉన్న ప్లేస్ నుంచి పోస్టు ద్వారా ఓటును పంపిస్తారు. <<-se>>#Elections2024<<>>

Similar News

News January 10, 2026

GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

image

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

News January 10, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.

News January 10, 2026

నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

image

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.