News May 24, 2024
మార్కెట్ లాభాల్లో ఉంటే స్టాక్స్ విక్రయించొచ్చా?

స్టాక్ మార్కెట్ల లాభాలకు టెంప్ట్ అయ్యి షేర్లు అన్నీ విక్రయించడం సరికాదంటున్నారు ఆర్థిక నిపుణులు. తాత్కాలిక పెట్టుబడి విధానానికి దూరంగా ఉండాలన్నారు. ‘ఈక్విటీల్లో 60%, డెట్లో 40% ఇన్వెస్ట్ చేసుంటే మార్కెట్లు ఆల్ టైమ్ హై చేరినప్పుడు ఈక్విటీల నిష్పత్తి పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని ఈక్విటీ షేర్లు అమ్మి డెట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


