News April 2, 2024
ఇంటికి పేరును మారిస్తే సొంతమైపోతుందా?: జైశంకర్
అరుణాచల్ ప్రదేశ్‌లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే, ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కాపలా ఉంది’ అని గుర్తుచేశారు.
Similar News
News November 8, 2024
US అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి గ్యాప్.. ఎందుకంటే?
అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో మార్చి 4గా ఉన్న ఈ తేదీని JAN 20కి మార్చారు. కాగా ఈ 2నెలలకు పైగా కాలంలో ప్రభుత్వ మార్పిడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. మంత్రులు, కీలక స్థానాల్లో ఉండే వారిని ఖరారు చేసుకుంటారు. DEC 17న ఎలక్టోరల్ కాలేజీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. JAN 6న ప్రతినిధుల సభ, సెనెట్ ట్రంప్ ఎన్నికను ఆమోదిస్తుంది.
News November 8, 2024
మీకు అండగా నేను ఉన్నా: జగన్
AP: దుర్మార్గ ఎల్లో మీడియా, దాని అనైతిక సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దీనివల్ల తమపార్టీ సానుభూతిపరులపై తప్పుడు కేసులు, వేధింపులు, అక్రమ నిర్బంధాలు రోజూ జరుగుతున్నాయన్నారు. అలాంటి వారికి తాను అండగా ఉంటానని, ప్రతి యుద్ధంలో తోడుగా ఉంటానని చెప్పారు. చివరికి సత్యమే గెలుస్తుందని రాసుకొచ్చారు.
News November 8, 2024
OTTలోని వచ్చేసిన ‘వేట్టయన్’ మూవీ
రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 10న విడుదలై దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, రానా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.