News March 22, 2024
మాజీ మంత్రుల సీట్లు గల్లంతేనా..?
AP: టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేనట్లే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సత్యనారాయణ, జవహర్కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఇటు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీపై సందిగ్ధం నెలకొంది. దీంతో అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటు పైనా క్లారిటీ రాలేదు. మరోవైపు సీనియర్లు సోమిరెడ్డి, కోళ్ల లలిత, వనమాడి వెంకటేశ్వర్లు టికెట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు.
Similar News
News November 25, 2024
RCB జట్టు ఇదే..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ ఈసారి ఆచితూచి వ్యవహరించింది. రిటెన్షన్లతో కలుపుకుని మొత్తం 22 మందిని కొనుగోలు చేసింది. జట్టు: కోహ్లీ, పటీదార్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషారా, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, జితేశ్ శర్మ, భువనేశ్వర్, కృనాల్ పాండ్య, జోస్ హేజిల్ వుడ్, రసిక్ దార్, స్వప్నిల్ సింగ్, భండాగే, బేథేల్, పడిక్కల్, ఎంగిడి, చికారా, అభినందన్, రాతే,
News November 25, 2024
సింగిల్ విండో ద్వారా అనుమతులు: నారాయణ
AP: భవనాలు, లేఔట్ల అనుమతులు సులభతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. DEC 31 నుంచి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనుంది. 15మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు అనుమతులు అవసరం లేదంది. అనుమతులకై రెవెన్యూ, రిజిస్ట్రేషన్& స్టాంప్స్, ఫైర్, గనులు, రైల్వే, ఎయిర్పోర్టుల సమీపంలో ఆయా శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట అనుమతులు ఇస్తామని, ఆన్లైన్లో అప్లై చేస్తే చాలని మంత్రి నారాయణ తెలిపారు.
News November 25, 2024
‘శైలజ’ మృతికి కారణం ఎవరు?
TG: ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విద్యార్థిని శైలజ(16) <<14706403>>మృతి చెందడం <<>>అందరినీ కలచివేస్తోంది. ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది. ఆమె మృతికి కారణం ఎవరు? ప్రభుత్వమా? పేదరికమా?