News May 22, 2024
సీఎం వ్యాఖ్యల కంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా?: స్వాతి

తనపై దాడి కేసును పారదర్శకంగా విచారించాలన్న ఢిల్లీ CM కేజ్రీవాల్ వ్యాఖ్యల కంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? అని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ప్రశ్నించారు. మాటలు, చేతలు ఒకేలా ఉండాలని ఆమె సూచించారు. ‘స్వయంగా సీఎం డ్రాయింగ్ రూమ్లోనే నన్ను కొట్టారు. అప్పటి నుంచి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ఇప్పుడు సీఎం పారదర్శక విచారణ కోసం అడుగుతున్నారు. దీన్ని నేను నమ్మను’ అని స్వాతి ట్వీట్ చేశారు.
Similar News
News November 18, 2025
NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.