News April 30, 2024
వేసవిలో టీ తాగొచ్చా?

చాలామంది ఎండాకాలంలో టీ తాగడం తగ్గిస్తుంటారు. వేసవిలో టీ తాగితే వేడి చేస్తుందని.. చల్లటి డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే.. టీ తాగడం వల్ల వేడి పెరగకపోగా ఐస్ వంటి కూల్ డ్రింక్స్ మీ శరీరంలో వేడిని పెంచుతాయట. పైగా టీ తాగితే బయట ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే శరీరం చల్లబడ్డట్లుగా ఫీల్ అవుతారట. వేసవిలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలే శరీరాన్ని చల్లబరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Similar News
News March 14, 2026
కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.
News March 14, 2026
2027 FEB వరకు టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

☛ ఈ ఏడాది జూన్ 6-20 వరకు AFGతో 1టెస్ట్, 3 వన్డేలు, ఆ తర్వాతి వారంలో IREతో 3 T20లు
☛ జులై 1-19 ENGతో 3వన్డేలు, 5 టీ20లు, JULY, AUGలో SLతో 3 టీ20లు, 2 టెస్టులు
☛ SEPలో AFGతో 3 టీ20లు, BANతో 3ODIs, 3 టీ20లు, ZIMతో 3 టీ20లు. ☛ SEP 25-OCT 3 ఏషియన్ గేమ్స్, WIతో 3 ODIs, 5 టీ20లు
☛ OCT-DECలో 5 ODIs, 5 టీ20లు, 2టెస్టులు, SLతో 3 ODIs, 3T20Is
☛ 2027 JAN-FEBలో AUSతో 5 టెస్టులు
News March 14, 2026
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. ☛ గట్టి, సున్నితమైన వస్తువుల్ని విడిగా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఉతకాలి. ☛ క్విక్ వాష్ ఆప్షన్ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. ☛ గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్ వాడటం మంచిది. ☛ అయితే వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ఉతకాలి.


