News October 22, 2024

ఈ చికెన్ తింటే బతుకుతామా?

image

TG: రెస్టారెంట్లు అపరిశుభ్ర, పాడైపోయిన వంటకాలతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజధాని హైదరాబాదే కాదు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తాజాగా నిజామాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆర్కేడ్ రెస్టారెంట్ అండ్ బార్, లహరి హోటల్‌లో కుళ్లిపోయిన చికెన్ దర్శనమిచ్చింది. దాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తించారు. అలాగే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తెలిపారు.

Similar News

News October 23, 2024

DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?

image

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్‌పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో సమానమని, ఇది శరీరంలోని అన్ని భాగాలను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యక్తి మెదడులో రక్తస్రావం జరిగి, పుర్రె లోపలి మెదడు కణజాలం పూర్తిగా దెబ్బతిందన్నారు. అతణ్ని బతికించడం కష్టమని తేల్చేశారు. మద్యం తాగకపోవడం మంచిదని సూచించారు.

News October 23, 2024

దసరాకి రూ.307.16 కోట్ల ఆదాయం: TGSRTC

image

TG: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సాధారణ బస్సులతో పాటు 10,513 అదనపు బస్సులను నడిపినట్లు TGSRTC అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకూ మొత్తం 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

News October 23, 2024

సిగ్నల్స్ వద్ద ఉండే పిల్లలు నిద్రపోయే కనిపిస్తున్నారా?

image

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసుకునే కొందరు వారి పిల్లలను నిద్రపుచ్చేందుకు డ్రగ్స్ వాడుతున్నారని సామాజిక వేత్తలు స్వాతి& విజయ్‌లు ఆరోపించారు. ఎందుకు నిద్రపోతున్నారో తెలియకుండానే బాల్యం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై నోరు విప్పాలని, అంతా కలిసి అలాంటి పిల్లలను కాపాడేందుకు ముందుకు సాగుదామని వీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీనిపై కరపత్రాలనూ పంచుతున్నారు.