News May 10, 2024
మద్యపాన నిషేధంపై నోరు మెదపరేం?

AP: రాష్ట్రంలో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రధాన తేడాల్లో మద్యపానం ఒకటి. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని చెప్పిన YCP హామీ మరిచింది. ఈ విషయంలో YCPని విమర్శిస్తున్న TDP, జనసేనలూ తాము మద్యపానం నిషేధిస్తామని హామీ ఇవ్వడం లేదు. మద్యంపై వస్తున్న ఆదాయంపైనే ప్రభుత్వాలు ఆధారపడుతుండటం ఇందుకు కారణం కావచ్చు. నిషేధం దేవుడెరుగు ఇంకా విస్తరించేందుకు చూస్తున్నారనే అభిప్రాయముంది.
Similar News
News November 2, 2025
ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 2, 2025
రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.
News November 2, 2025
రాజమండ్రిలోని NIRCAలో 27 ఉద్యోగాలు

రాజమండ్రిలోని ICAR- <


