News March 22, 2024

జైలు నుంచే CMగా పని చేయవచ్చా?

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు నేరం రుజువైతే జైలు శిక్ష పడవచ్చు. అయితే.. ఆయన జైలు నుంచే రాష్ట్రాన్ని నడిపిస్తారని AAP నేతలు చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా? అంటే.. సాధ్యమే. కేజ్రీవాల్‌కు జైలు శిక్ష పడినా కారాగారం నుంచే ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. జైలు నుంచి CMగా పని చేయవద్దనే నిబంధనలు రాజ్యాంగంలో లేవు. 2ఏళ్ల జైలు శిక్ష పడితే మాత్రం ఆయన పదవి కోల్పోతారు.

Similar News

News December 1, 2025

‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

image

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.

News December 1, 2025

హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

image

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 1, 2025

‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

image

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్‌ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.