News October 23, 2024

USలో ఎన్నికల ప్రచారానికి వెళ్తే డబ్బిస్తారా?

image

మన దగ్గర ఎన్నికల ప్రచారానికి వెళితే బీరు, బిర్యానీ, డబ్బు ఇస్తారనేది ఏ పార్టీ ఒప్పుకోకపోయినా అదే నిజం. అయితే అమెరికాలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని అక్కడి భారతీయులంటున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి భోజనం, ప్రయాణ ఖర్చులు ఇస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదంటున్నారు. పైగా ‘ఫండ్ రైజింగ్ మీటింగ్స్’ పేరుతో జనాల నుంచే డబ్బు తీసుకుంటారంటున్నారు.

Similar News

News December 26, 2025

నేడు 3వ T20.. భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

ఉమెన్స్: 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ 3వ T20 తిరువనంతపురంలో జరగనుంది. తొలి రెండో T20ల్లో టీమ్ఇండియా ఘన విజయాలు సాధించింది. అదే ఫామ్‌ కంటిన్యూ చేస్తూ ఇవాళ్టి మ్యాచులోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు శ్రీలంక సైతం సిరీస్‌లో తొలి విజయం కోసం నిన్న నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. 7pmకు JioHotstar, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.

News December 26, 2025

ధనుర్మాసం: పదకొండో రోజు కీర్తన

image

‘గొప్ప వంశంలో పుట్టిన చిన్నదానా! వేలకొద్దీ పశుసంపద గల బంగారు తీగవంటిదానా! నీ స్నేహితులమంతా నీ ఇంటి వాకిట చేరి శ్రీకృష్ణుని నామాలను గొంతెత్తి పాడుతున్నాము. ఇంత సందడి జరుగుతున్నా, నీవు మాత్రం ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నావు. కృష్ణునితో కలిసుండే ఆత్మానందాన్ని నీవు ఒక్కదానివే అనుభవించడం సరికాదు. అందరితో కలిసి ఆ స్వామిని సేవించడానికి త్వరగా బయటకు రా. మనమంతా కలిసి ఈ వ్రతాన్ని పూర్తి చేద్దాం, రా!’

News December 26, 2025

ఇలా చేస్తే మానసిక ఆందోళన దూరం!

image

ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురై ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేవారు కొన్నింటిని పాటిస్తే ప్రశాంత జీవితం సొంతమవుతుంది. ‘మైండ్‌ఫుల్ వాకింగ్ అంటే నడుస్తూ పాదాలు నేలను తాకుతున్న స్పర్శ, కాళ్ల కదలికలపై దృష్టి పెట్టాలి. ఇది వర్తమానంలో ఉంచుతుంది. తినేటప్పుడు టీవీ చూడకుండా రుచి, వాసనను ఆస్వాదించాలి. అలాగే హాయిగా కూర్చొని కళ్లు మూసుకొని శ్వాసను గమనిస్తే ఆందోళన దూరమవుతుంది’ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.