News September 26, 2024
ఈ ఇద్దరిలో సీఎం ఎవరో కనిపెట్టగలరా..!

పై ఫొటో చూశారా..? వారిద్దరిలో ఒకరు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కాగా మరొకరు ఆయన వీరాభిమాని మున్నా లోహరా. ముఖ్యమంత్రి ఈ పిక్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఒక హేమంత్ మరో హేమంత్‌ను కలిశారు. ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహరాను ఆయన కుటుంబీకులతో సహా కలిసి మాట్లాడాను’ అని పేర్కొన్నారు. లోహరా ప్రస్తుతం సీఎంలా రూపురేఖల్ని మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ ఫొటో నెట్టింట ఆసక్తిని రేపుతోంది.
Similar News
News February 9, 2026
‘స్పిరిట్’ నుంచి తప్పుకోలేదు: ప్రకాశ్ రాజ్

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. ‘నా సీన్లకు సంబంధించి ఇంకా షూటింగే స్టార్ట్ చేయలేదు. అప్పుడే స్టోరీలు రాసేస్తున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రకాశ్ రాజ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News February 9, 2026
పెన్షన్ల పెంపుపై కసరత్తు!

TG: చేయూత పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా 2026-27 బడ్జెట్‌లో ₹1,000, 2027-28 బడ్జెట్‌లో మరో ₹1,000 పెంచాలని పరిశీలిస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు CM రేవంత్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక శాఖ అదనపు నిధుల కోసం అన్వేషిస్తోంది. పెన్షన్‌ను ₹2,000 నుంచి ₹4,000కి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 9, 2026
పులి ఎదురుపడితే ఏం చేయాలి?

తెలుగు రాష్ట్రాల్లో <<19045804>>పులుల<<>> బెడదతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి ఎదురుపడినప్పుడు అరుస్తూ పరిగెత్తడం, దాక్కోవడం వంటివి చేయొద్దని అటవీ అధికారులు చెబుతున్నారు. పులికి మనం ఆహారం కాదనే స్పష్టమైన సందేశం ఇచ్చేలా దాని కళ్లలోకి చూస్తూ కదలకుండా ఉండాలంటున్నారు. మనం పెద్దగా కనిపించినప్పుడు పులి వేటాడకుండా వెనక్కి తగ్గుతుందట. తమ కంటే పెద్ద ఆకారంలో ఉండేవాటిపై దాడి చేయకపోవడం అడవి జంతువుల లక్షణం.


