News October 18, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పిల్లలు పుట్టరా?

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను చికిత్సకు ముందే తీసి ఫ్రీజ్&ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.
Similar News
News October 18, 2025
DA బకాయిలు వెంటనే చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు

AP: ఉద్యోగ సంఘాలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ ముగిసింది. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను ఉద్యోగ నేతలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 4 DA బకాయిలు చెల్లించాలని, కొత్త PRC, పెన్షన్ సహ అనేక సమస్యలను మంత్రుల ముందుంచారు. వీటిలో కొన్నింటిపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ అంశాలను CM దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
News October 18, 2025
మహిళలకు వేపాకుతో చర్మ సౌందర్యం

* వేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యం, సౌందర్యానికి వేపాకు ఎంతో మేలు చేస్తుంది.
* నీటిలో గుప్పెడు వేపాకులను వేసి మరిగించాలి. తర్వాత వడగట్టి ఆ కషాయాన్ని పడుకునే ముందు ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు, జిడ్డు దూరమవుతాయి.
* నీటిలో కలుపుకుని స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
✍️ రోజూ స్కిన్, హెయిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 18, 2025
అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

TG: ప్రభుత్వ స్కీముల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను CM రేవంత్ హెచ్చరించారు. CMO కార్యదర్శులు, CSతో సమావేశమయ్యారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. అన్ని విభాగాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలి. ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.