News October 4, 2024

జగన్‌తో దీక్ష చేయించగలరా?: భూమనకు బీజేపీ నేత సవాల్

image

AP: పవన్ కళ్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఫైర్ అయ్యారు. పవన్‌ను స్వామి అని సంభోధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ అధినేతతో భూమన దీక్ష చేయించగలరా? అని సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయాల ప్రకారం జగన్‌తో ఇంట్లో పూజలు చేయించగలిగే సత్తా భూమనకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలను గౌరవించని వ్యక్తి జగన్ అని విమర్శించారు.

Similar News

News January 24, 2026

జిల్లాల విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదు: నాయిని

image

జిల్లాల విభజనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అవుతుందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు బట్టలు చించుకుంటోందో చెప్పాలని స్పష్టం చేశారు.

News January 24, 2026

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in

News January 24, 2026

మనాలిపై మంచు దుప్పటి..

image

హిమాచల్‌ప్రదేశ్ మనాలిలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు తీవ్రతకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 3రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. SAT రాత్రి టెంపరేచర్లు ‘-3’ డిగ్రీలుగా నమోదుకావొచ్చని, 10-15KMల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.