News March 15, 2025
ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్‌నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 15, 2025
21 రోజులైనా దొరకని అచూకీ

TG: శ్రీశైలం SLBC టన్నెల్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఏడుగురి కార్మికుల ఆచూకీ 21 రోజులైనా లభించలేదు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు అత్యాధునిక రోబోలను ఉపయోగిస్తున్నారు. టన్నెల్‌లోకి బురద చేరడం, నీటి ఊట రావడంతో రెస్య్కూకు ఆటంకం కలుగుతోంది. ఐదు రోజుల క్రితం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే.
News March 15, 2025
యూఎస్‌లో ఎప్పటికీ భాగమవ్వం: కెనడా ప్రధాని

కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వస్తూనే తన మార్క్ చూపించారు. తమ దేశం ఎప్పుడూ యూఎస్‌లో భాగం కాబోదని స్పష్టం చేశారు. అయితే దేశ ప్రయోజనాల కోసం తాము ట్రంప్ అడ్మినిష్ట్రేషన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ కెనడా 24వ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో భాగమవ్వమని కోరిన సంగతి తెలిసిందే.
News March 15, 2025
జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.