News June 17, 2024
తక్కువ గడువు ఉంటే ఈక్విటీల్లో పొదుపు చేయొచ్చా?

ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి తక్కువ టైమ్ ఉన్నప్పుడు ఈక్విటీలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత చదువులకు 2-3 ఏళ్లే ఉంటే ఒడుదొడుకులకు అవకాశం ఉన్న ఈక్విటీల్లో పొదుపు సరికాదంటున్నారు. మార్కెట్ క్రాష్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒకవేళ ఏళ్లుగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టినా టైమ్ దగ్గరపడినప్పుడు కొంత FD చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News December 16, 2025
32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.
News December 16, 2025
కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం

AP: కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.
News December 16, 2025
అవెంజర్స్, సూపర్ మ్యాన్ కల్పితాలు.. మనవి సత్యాలు: బోయపాటి

అఖండకు అవెంజర్స్లా స్కోప్ ఉందని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. ‘నిజానికి అవెంజర్స్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అన్నీ కల్పితాలు. కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది’ అని మీడియా సమావేశంలో అన్నారు. పూర్తి లాజిక్తోనే మూవీని తీశామని, అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని చెప్పారు.


