News August 21, 2025
చైనాను నమ్మొచ్చా?

అమెరికా టారిఫ్స్‌కు వ్యతిరేకంగా <<17476240>>భారత్-చైనా<<>> దగ్గరవుతున్నాయి. తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది. అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాను దాటి ప్రపంచ నం.1 అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్‌కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే USను దూరం చేసుకోవద్దంటున్నారు. దీనిపై మీ COMMENT?
Similar News
News August 22, 2025
పాక్‌ని కాపాడుతాం.. బుద్ధి బయట పెట్టిన చైనా

పాకిస్థాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని చైనా ప్రకటించింది. ‘పరిశ్రమ, వ్యవసాయ, మైనింగ్ రంగాల్లో మా సపోర్ట్ ఉంటుంది. వారి సార్వభౌమాధికారం, ఉగ్రవాదంపై పోరులో మద్దతిస్తాం. పాక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుంది’ అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ తెలిపారు. భారత్‌తో వాణిజ్యాన్ని ఆహ్వానిస్తూ.. పాక్‌కు మద్దతిస్తామనడం వెనుక చైనా అసలు బుద్ధి అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి.
News August 22, 2025
ఆన్‌లైన్ గేమింగ్ బిల్: Dream 11 బంద్!

కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ బిల్-2025 తీసుకురావడంతో Dream Sportsకు చెందిన Dream 11 బంద్ కానుంది. తాము అన్ని రకాల రియల్ మనీ గేమింగ్ బిజినెస్‌లను మూసేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించినట్లు సమాచారం. ఇక నుంచి తాము FanCode, DreamSetGo, Dream Game Studiosనే నడుపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. 2024 ఆర్థిక సం.లో Dream Sports ఆదాయం రూ.9,600 కోట్లు కాగా అందులో 90% Dream 11 నుంచే వచ్చింది.
News August 21, 2025
ఆన్‌లైన్ గేమింగ్ బిల్ సొసైటీని రక్షిస్తుంది: మోదీ

ఆన్‌లైన్ గేమింగ్ బిల్-2025 పార్లమెంట్‌లోని ఇరు సభల్లో పాసైనట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘ఇండియాని గేమింగ్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో మేము కట్టుబడి ఉన్నాం. ఇది ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఆన్‍లైన్ మనీ గేమ్స్‌కు సంబంధించిన హానికరమైన ప్రభావాన్ని మధ్యతరగతి ప్రజలు, సొసైటీపై పడకుండా అడ్డుకుంటుంది’ అని ప్రధాని ట్వీట్ చేశారు.