News October 24, 2024

ఖలిస్థానీలకు కెనడా అందమైన దేశం: సంజయ్ వర్మ

image

ఖలిస్థానీ ఉగ్ర‌వాదుల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు కెన‌డా ఓ అంద‌మైన దేశ‌మ‌ని, అక్క‌డి సున్నిత‌మైన న్యాయ వ్య‌వ‌స్థ వ‌ల్ల వారు ఆశ్ర‌యం పొందుతున్నార‌ని దౌత్య‌వేత్త‌ సంజ‌య్ వ‌ర్మ వ్యాఖ్యానించారు. నిజ్జ‌ర్ హ‌త్య కేసులో త‌న‌ను అనుమానితుల జాబితాలో చేర్చ‌డం షాక్‌కు గురి చేసిందని, ఇదోర‌క‌మైన వెన్నుపోట‌ని పేర్కొన్నారు. త‌మ వేర్పాటువాదానికి మ‌ద్ద‌తు ఇవ్వాలని ఖలిస్థానీలు ఇతర సిక్కులను బెదిరిస్తున్నారని అన్నారు.

Similar News

News October 24, 2024

శారదా పీఠానికి భూముల కేటాయింపు రద్దు

image

AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.

News October 24, 2024

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

image

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు 51వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కానికి రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ము ఆమోదం తెలిపారు. న‌వంబ‌ర్ 11న జ‌స్టిస్ ఖ‌న్నా సీజేఐగా ప్ర‌మాణం చేస్తారు. జ‌స్టిస్ ఖ‌న్నా పేరును ప్ర‌స్తుత సీజేఐ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.

News October 24, 2024

తిన్న తర్వాత ఇలా చేస్తే..

image

పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఊబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కాఫీ, టీ తాగితే కడుపులో గ్యాస్, జీర్ణసంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మసాలాలు, మాంసాహారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనం చేశాక కచ్చితంగా కనీసం 100 అడుగులు వేయాలి.