News November 22, 2024

దెబ్బకు దిగొచ్చిన కెనడా: హత్యలతో మోదీకి సంబంధం లేదంటూ వివరణ

image

హర్దీప్‌‌నిజ్జర్ హత్య, ఇతర నేరాలతో PM మోదీకి సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ధ్రువీకరించే ఆధారాలేమీ లేవని వెల్లడించింది. గ్లోబ్, మెయిల్ న్యూస్‌పేపర్లలో కథనాలు వదంతులేనని తెలిపింది. అమిత్ షా, జైశంకర్, అజిత్ దోవల్, మోదీకి నిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్టు ఈ పత్రికలు చిత్రీకరించాయి. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్యసంబంధాలు ఇంకా దెబ్బతింటాయని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

Similar News

News November 22, 2024

భయంతో బంగారం కొంటున్న కస్టమర్లు!

image

దేశవ్యాప్తంగా బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. ట్రంప్ రాకతో గోల్డ్ రేట్ 6% మేర తగ్గింది. ఇంకా తగ్గుతుందేమో అని కస్టమర్లు వేచిచూసే ధోరణి కనబరిచారు. తాజాగా ఉక్రెయిన్, రష్యా పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకోవడంతో NOV 19న రూ.73,739గా ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.76,559కి చేరుకుంది. వెడ్డింగ్ సీజన్ కావడం, రేటు మరింత పెరగొచ్చేమోనన్న భయంతో కస్టమర్లు నగలు కొంటున్నారని జువెలరీ సంఘం సభ్యులు చెప్తున్నారు.

News November 22, 2024

ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీకే?

image

ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు దక్కినట్లు తెలుస్తోంది. 2031 వరకు ఆ సంస్థ మ్యాచులను ప్రసారం చేస్తుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచులను సోనీ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

News November 22, 2024

AR రెహమాన్‌ కుమారుడు ఎమోషనల్ పోస్ట్

image

భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న రూమర్స్ పట్ల కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించారు. ‘నా తండ్రి లెజెండ్. ఆయన విలువలు పాటిస్తూ ఎనలేని గౌరవం, ప్రేమను సంపాదించారు. నా తండ్రిపై అసత్య, అర్థరహిత వార్తలు చూస్తే బాధేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని మానుకొని, ఆయన మనపై చూపిన ప్రభావం పట్ల గౌరవంగా ఉందాం’ అని పోస్ట్ చేశారు.