News January 8, 2025
అమెరికాలో కెనడా విలీనం.. ట్రంప్ పోస్ట్ వైరల్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.
Similar News
News January 19, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://skltghu.ac.in/
News January 19, 2026
ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.
News January 19, 2026
FEB 9న AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక

AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక FEB 9న జరగనుంది. ఈనెల 27వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ‘మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మంది వైద్యుల్లో రాష్ట్రంలో ఐదేళ్లకు పైబడి ఉంటున్న వారు పోటీకి అర్హులు. సభ్యులు ఎక్కడ్నుంచైనా ఆన్లైన్, మొబైల్ ద్వారా ఓటు వేయొచ్చు. దీనికోసం APMC ఆన్లైన్ ఎలక్షన్ పోర్టల్లో లాగిన్ కావాలి’ అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడించారు. కాగా APMCకి 13 మందిని ఎన్నుకుంటారు.


