News October 5, 2025
మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి: సిట్

AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రద్దుచేయాలని హైకోర్టులో CID ఆధ్వర్యంలోని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ACB కోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొంది. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌లో తన నేర చరిత్ర వివరాలను పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. పిటిషన్ దాఖలు చేసిన 10 రోజులకే బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 5, 2025
వారిని కఠినంగా శిక్షించాలి: KTR

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>> తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన ఘటనపై KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఘోరం. ఈ మందు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్, దానిని అప్రూవ్ చేసిన అథారిటీలను కఠినంగా శిక్షించాలి. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కారకులందరినీ జైలులో వేయాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
News October 5, 2025
5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.