News September 11, 2024

ఇరాన్‌కు వెళ్లే అన్ని విమాన సేవల్ని రద్దు చేస్తున్నాం: UK

image

తమ దేశం నుంచి ఇరాన్ వెళ్లే అన్ని ప్రత్యక్ష విమాన సేవల్ని రద్దు చేస్తున్నట్లు UK ప్రకటించింది. అదే విధంగా తమ దేశంలో ఇరాన్ విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. రష్యాకు క్షిపణుల్ని సరఫరా చేసిన కారణంగా టెహ్రాన్‌పై విధించిన ఆంక్షల్లో ఈ నిర్ణయం భాగమని వివరించింది. తమ అంతర్జాతీయ భాగస్వాములకు సంఘీభావంగా ఇరాన్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక గగనతల ఒప్పందాల్నీ రద్దు చేసుకుంటామని తెలిపింది.

Similar News

News January 24, 2026

పిల్లల ముందు గొడవ పడితే..

image

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు వంటివి ఉంటే ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని fcfcoa అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

News January 24, 2026

బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

image

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.

News January 24, 2026

నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

image

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.