News September 25, 2024

రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డుల రద్దు?

image

TG: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

Similar News

News September 25, 2024

హర్షసాయి కోసం గాలింపు

image

TG: యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. హర్ష పరారీలో ఉన్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా 376(2), 376N, 354 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది.

News September 25, 2024

కాన్పూర్ టెస్ట్.. బుమ్రాకు రెస్ట్?

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 27 నుంచి జరగనున్న 2వ టెస్ట్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కివీస్, AUSతో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉండటం, కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో అతడిని డ్రాప్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే IND అశ్విన్, జడేజాతో పాటు మరో స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆ స్థానం కోసం కుల్దీప్, అక్షర్ పోటీ పడుతున్నారు.

News September 25, 2024

అమరావతిలో MSME శిక్షణ కేంద్రం

image

AP: అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని ప్రతిపాదించగా, 20 ఎకరాల భూములను కేంద్ర MSME డెవలప్‌మెంట్ కమిషనర్ పేరిట ఉచితంగా బదిలీ చేయనుంది. విశాఖలో ఉన్న మొదటి టెక్నాలజీ సెంటర్‌లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, PG డిప్లొమా సహా పలు MSME కోర్సులు అందిస్తోంది.