News October 3, 2024

రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD ఈవో

image

AP: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాహన సేవలు ఉ. 8గంటలకు, రాత్రి 7గంటలకు నిర్వహిస్తామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. 8వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుందని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. 7లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.

Similar News

News January 18, 2026

4 రోజుల్లో ₹14,266 కోట్లు ఔట్

image

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) గతవారం ఏకంగా ₹14,266 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల భయాల నేపథ్యంలో విదేశీ సంస్థలు తమ పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుంటున్నాయి. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ₹16,174 కోట్లు పంప్ చేయడంతో మార్కెట్లు స్థిరంగా నిలబడగలిగాయి.

News January 18, 2026

చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

image

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.

News January 18, 2026

2027 సంక్రాంతికి లైన్‌లో చిరు, రజినీకాంత్!

image

2027 సంక్రాంతి సినిమాలపై చర్చ అప్పుడే మొదలైంది. ‘MSVPG’తో హిట్ అందుకున్న చిరంజీవి వచ్చే సంక్రాంతికి మరో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో తేజా సజ్జ ‘జాంబిరెడ్డి 2’తో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్, కామెడీ జానర్‌ సినిమాతో శర్వానంద్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌తో అనిల్ రావిపూడి, కొత్త సినిమాతో రజినీకాంత్ సంక్రాంతి బాక్సాఫీస్‌పై కన్నేశారు.