News May 19, 2024
అగ్నివీర్ రద్దు.. పాత విధానంలో నియామకాలు చేస్తాం: రాహుల్ గాంధీ
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గతంలో మాదిరిగానే రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. యూపీలో వారణాసి(ప్రధాని మోదీ) సీటును మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్‌తో ఎన్డీఏ ప్రజల జీవితాలను ప్రమాదంలో నెట్టిందని, ఇప్పుడు రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Similar News
News December 23, 2024
ALERT.. 3 రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
News December 23, 2024
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా
దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్‌తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.
News December 23, 2024
DHOP మూమెంట్.. స్టార్ హీరోలతో తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.