News July 16, 2024

అల్పాహార పథకం రద్దు చేయడం దురదృష్టకరం: KTR

image

TG: తాము అమల్లోకి తీసుకొచ్చిన అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అల్పాహార పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 8, 2025

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

image

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.

News December 8, 2025

‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

ఇంటి పేరు వద్దనుకున్న సమంత?

image

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ అని ఉంది. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఆమె తన పేరు పక్కన ఎవరి ఇంటి పేరును పెట్టుకునేందుకు ఇష్టపడట్లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం ‘సమంత’ అనే బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కాగా అంతకుముందు సమంత అక్కినేని అని ఉండేది.