News November 7, 2024
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు
TG: కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కాంట్రాక్టును GOVT రద్దు చేసింది. ఆరేళ్ల నుంచి పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గోదావరి ఫేజ్-2లో భాగంగా HYD తాగునీటి అవసరాల కోసం శామీర్‌పేట సమీపంలో దీనిని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ వరకు స్కీమ్‌ను పొడిగించి HYDకు నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు GOVT తెలిపింది.
Similar News
News November 7, 2024
STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.
News November 7, 2024
ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’
సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.
News November 7, 2024
ట్రంప్ విజయం.. మస్క్‌కు ₹2.2లక్షల కోట్లు లాభం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్‌కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.