News August 20, 2025

ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు.. AG సలహా తీసుకోనున్న ప్రభుత్వం!

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరామ్, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను <<17393463>>రద్దు<<>> చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు కాపీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీనిపై అడ్వకేట్ జనరల్‌(AG)ను సంప్రదించాలని నిర్ణయించింది. AG సలహా మేరకు ఈసీకి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News August 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

⋆ లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
⋆ జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లుపై సభలో దుమారం
⋆ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
⋆ భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: CM రేవంత్
⋆ పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
⋆ కర్నూలు జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
⋆ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో

News August 21, 2025

AP న్యూస్ రౌండప్

image

* కర్నూలు (D)లో <<17465047>>చిన్నారుల మృతి<<>> పట్ల CM చంద్రబాబు సంతాపం, జగన్ దిగ్భ్రాంతి
* విద్యాశాఖకు కేంద్రం అదనంగా రూ.432.19CR కేటాయింపు
* నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు పీపీలు, 15మంది ఏపీపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లాయర్లపై ప్రభుత్వం వేటు
* PRC, డీఏలపై వెంటనే ప్రకటన చేయాలి: APNGO అధ్యక్షుడు విద్యాసాగర్
* అప్పులు తీరాక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: బొత్స

News August 21, 2025

అంగన్వాడీల్లో త్వరలో బ్రేక్ ఫాస్ట్: మంత్రి సీతక్క

image

TG: రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పిల్లలకు త్వరలో అల్పాహారం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉదయం వేళ ప్రతి చిన్నారికీ 100ml పాలు సరఫరా చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. అంగన్వాడీల్లోని వసతులపై అధికారులతో ఆమె సమీక్షించారు. వారంలో కనీసం ఒకరోజు ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ పెట్టాలని వారికి సూచించారు. HYDలో ప్రయోగాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయగా 30% అటెండెన్స్ పెరిగిందన్నారు.