News September 4, 2024

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు

image

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచిన MLAలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన MLAలకు పెన్షన్ రద్దు కానుంది. వారి జీవితంలో ఏ సమయంలోనైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.

Similar News

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News November 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2025

ఇండియా ఘన విజయం

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.