News March 18, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి రద్దు

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News March 30, 2026
SC యాక్షన్ ప్లాన్ దరఖాస్తు గడువు పొడిగింపు: ADB కలెక్టర్

SC యాక్షన్ ప్లాన్ కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు గడువును మరోసారి పొడగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీలోపు ఆసక్తి గల యువత దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోని సబ్సిడీ పొందాలని కోరారు.
News March 29, 2026
లోక్ అదాలత్‌లో 5,399 కేసులు పరిష్కారం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 5,399 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందులో 3,812 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,017 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయి. సైబర్ బాధితులకు రూ.9.95 లక్షలు వాపసు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News March 29, 2026
ADB: ఏప్రిల్ 1 నుంచి పదో తరగతి పత్రాల మూల్యాంకనం

జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 – 9 వరకు నిర్వహించనున్నట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం 614 మంది ఉపాధ్యాయులను కేటాయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 466 మంది చీఫ్ ఎగ్జామినర్లు (CE), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AE) ఉండగా, 148 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు వెల్లడించారు.


