News March 17, 2024
పోలీస్ కార్యాలయంలో స్పందన రద్దు: ఎస్పీ తుషార్

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
Similar News
News January 27, 2026
తెనాలిలో దారుణం.. భార్యను చంపి భర్త పరార్

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News January 27, 2026
సచివాలయ సీఎస్ఓకు ఇండియన్ పోలీస్ మెడల్

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.
News January 27, 2026
రాజధాని రైతులకు 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


