News March 17, 2024

స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

కర్నూలు: ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున “స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో, డివిజన్ స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కలెక్టర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Similar News

News July 5, 2024

మంత్రాలయం మండలంలో ఒడిశా వాసి మృతి

image

మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మంత్రిగాండ్ అనే వ్యక్తి బోర్ వెల్ లారీలో దినసరి కూలీగా పనిచేసేవాడు. పని ముగించుకుని అదే లారీపై తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో పైన ఉన్న సర్వీస్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు.

News July 5, 2024

రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం

image

కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్‌తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

News July 5, 2024

కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.