News March 17, 2024
ఎన్నికలు పూర్తయ్యే వరకు స్పందన రద్దు: విజయనగరం కలెక్టర్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు, అర్జీ దారులు గమనించాలని కోరారు.
Similar News
News February 2, 2026
కలెక్టర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి కొండపల్లి

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం నూతన భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని కొండపల్లి ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లా అభివృద్ధికి రథసారథిగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కార దిశగా పనిచేస్తున్నారని కలెక్టర్‌ను కొనియాడారు.
News February 2, 2026
ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వైద్య బీమా: మంత్రి

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య బీమా కల్పించే పథకాన్ని సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎస్.కోటలో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 65 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో రోగికి ఏడాదికి సుమారు రూ.20 వేలు ఖర్చు చేయడమే కాకుండా నెలకు రూ.10 వేలు పింఛన్ కూడా ఇస్తున్నామని తెలిపారు.
News February 2, 2026
పలు కేసుల్లో నిందితుడిపై PD యాక్ట్: VZM SP

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మజ్జి కృష్ణవర్ధన్ (చెర్రీ)పై జిల్లా పోలీసు శాఖ PD యాక్ట్ ప్రయోగించింది. నిందితుడిని ముందస్తు నిర్బంధంలో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని SP దామోదర్ ఆదివారం తెలిపారు. గత ఐదేళ్లలో విజయనగరానికి చెందిన చెర్రీపై పట్టణ పోలీస్ స్టేషన్లో 8, మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.


