News March 18, 2024
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ‘స్పందన’ రద్దు: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News December 11, 2025
జిల్లాలో 1315 పోలియో బూత్లు ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో ఈనెల 21న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు కలిగిన 1,87,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. దీని కోసం 1,315 పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులు విధులకు హాజరుకావాలని కోరారు.
News December 11, 2025
భీమవరం: ‘జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ’

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ అన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఇంధన పొదుపు భాగంగా గురువారం వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.
News December 11, 2025
మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


