News October 28, 2024
31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

AP: తిరుమలలో దీపావళి ఆస్థానం దృష్ట్యా ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు TTD వెల్లడించింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ నెల 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Similar News
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.


